నీట్‌ విద్యార్థిని ఆత్మహత్యలో ట్విస్ట్‌.. 92% మార్కులొచ్చాయంది.. తీరా చూస్తే..!

  • కర్ణాటకలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
  • తండ్రికి తప్పుడు మార్కులు చెప్పిన భాగ్యశ్రీ
  • ఆన్‌లైన్ రిజల్ట్స్‌తో బయటపడ్డ అసలు నిజం
  • పరీక్షల్లో ఘోరంగా ఫెయిల్ అయిన విద్యార్థిని
  • కూతురు మరణంతో కుంగిపోయిన తండ్రి
కర్ణాటకకు చెందిన ఓ నీట్ విద్యార్థిని ఆత్మహత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. 12 వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విషయాన్ని దాచిపెట్టి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులను నమ్మించింది. తీరా అసలు నిజం తెలిసేసరికి ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది.

తండ్రికి అబద్ధం
భాగ్యశ్రీ అనే 18 ఏళ్ల విద్యార్థిని ఇటీవల నీట్ పరీక్ష రాసింది. గతవారం ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే అంతకుముందే మే 21న విడుదలైన 12వ తరగతి ఫలితాల్లో తనకు 92 శాతం మార్కులు వచ్చాయని భాగ్యశ్రీ తన తండ్రికి అబద్ధం చెప్పింది.

తండ్రి ఏమన్నారంటే?
కూతురు చనిపోయిన కొత్తలో ఆమె తండ్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. తన కూతురు చదువులో చాలా చురుకైనదని చెప్పారు. పీయూసీ పరీక్షల్లో 92 శాతం మార్కులతో పాసయినట్టు సంతోషంగా చెప్పిందని అన్నారు. కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని ఆవేదన చెందారు.

ఆన్‌లైన్‌లో చూస్తే షాక్!
కూతురు చనిపోయిన తర్వాత తండ్రి రాజశేఖర్ ఆన్‌లైన్‌లో ఆమె 12 వ తరగతి మార్కులను పరిశీలించారు. మార్క్‌షీట్ చూసి ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. భాగ్యశ్రీ 12వ తరగతి పరీక్షల్లో ఘోరంగా ఫెయిల్ అయింది. ఇంటర్నల్ మార్కులు కలిపినా ఫిజిక్స్‌లో 45, మ్యాథ్స్‌లో కేవలం 24 మార్కులు మాత్రమే వచ్చాయి.

ఎవరిని నిందించాలి?
మార్కులు చూసిన తండ్రి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కూతురు తమతో ఎంతో సంతోషంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. తమకు అబద్ధం చెప్పి ఇప్పుడు లోకాన్ని విడిచి వెళ్లిపోయిందని కన్నీరుమున్నీరయ్యారు. తాము ఈ ఘటనపై ఎవరినీ నిందించదలుచుకోలేదని, పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.

Bhagyashree
NEET student suicide
Karnataka
NEET exam
failed in exam
student commits suicide
lies to father
12th class results
father shocked
student depression

More Telugu News